ఏపీ మత్స్యకారులకు శుభవార్త.. ఆ రోజు అకౌంట్లో రూ.20000 జమ

by Veldandi saikiran |   ( Updated:2025-04-15 10:44:29.0  )
ఏపీ మత్స్యకారులకు శుభవార్త.. ఆ రోజు అకౌంట్లో రూ.20000 జమ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారులకు.. చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీలోని మత్స్యకారులకు... ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఒక్కో లబ్ధిదారుని అకౌంట్లో ₹20,000 ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. చేపల వేట నిషేధ సమయంలో.... ఏపీలోని మత్స్యకారులకు ( AP fishermen)... ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 10000 రూపాయల నుంచి 20వేల రూపాయలకు పెంచుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ( Nimmala Rama Naidu ) వెల్లడించారు.


ఈ నెల 26వ తేదీన మత్స్యకారుల అకౌంట్లలో 20వేల రూపాయల చొప్పున జమ అవుతాయని వివరించారు. ఈ నెల 26వ తేదీన స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఈ సాయం అందిస్తామని ప్రకటన చేశారు. ఓ మత్స్యకార గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) పర్యటిస్తాడని కూడా వివరించారు. త్వరలోనే షెడ్యూల్ కూడా ఖరారు చేస్తామని క్లారిటీ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు.

61 రోజుల పాటు చేపల వేట బంద్

ఏపీలోని చేపల సంతానోత్పత్తి, తల్లి చేపలు, తల్లి రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను పోషించడం కోసం... ఏపీలో 61 రోజులపాటు చేపల వేట పై ఆంక్షలు విధించారు అధికారులు. ఈ రూల్స్ ఏప్రిల్ 15వ తేదీ అంటే ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే చేపల వేటపైన ఆధారపడి ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు.. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు... ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.

Next Story

Most Viewed