- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులొచ్చాక ధర్నాలు ఎందుకు : మంత్రి నారాయణ
నెల్లూరులోని (Nellore) చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ (Underpass) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన విషయం విదితమే.

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరులోని (Nellore) చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ (Underpass) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన విషయం విదితమే. అయితే దీనిపై పలువురు ధర్నాలు చేయడాన్ని రాష్ట్ర మంత్రి నారాయణ (Minister Narayana) తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ ను సాంక్షన్ చేసిందన్నారు. అనుమతులు వచ్చాక దాన్ని రాజకీయం చేయటం సిగ్గుచేటని అన్నారు. ఒక పథకం మంజూరు అయిన తరువాత టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందన్నారు. పనులు మొదలయ్యే దశలో ఆ పథకం కావాలంటూ కొందరు ధర్నాలు చేయడం ఏమిటని నిలదీశారు. ఈ బ్రిడ్జి విషయంలో నెల్లూరువాసులెవరూ (Nellore Residents) ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతుల మంజూరు, పనులు చేసే విధానం వేరే ఉంటుందన్నారు. మూడు నెలల్లో టెండర్లు పిలుస్తారని ప్రకటించారు. పని ప్రారంభించిన తర్వాత ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం సిటీ పరిధిలో వివిధ పాఠశాలల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించారు. వీఆర్సీ హైస్కూల్ లాగా మరో 15 స్కూళ్ల రూపురేఖలు మారుస్తామని ఈ సందర్భంగా హామీనిచ్చారు.






