మరింత పెరిగిన టీడీపీ బలం.. క్యాంపునకు 38 మంది తరలింపు

by Vemula.Srinu Prasad |

మరో కార్పొరేటర్ చేరికతో నెల్లూరులో టీడీపీకి మరింత బలం పెరిగింది..

మరింత పెరిగిన టీడీపీ బలం.. క్యాంపునకు 38 మంది తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)లో రాజకీయం రసవత్తరంగా మారింది. మేయర్ స్రవంతి(Mayor Sravanti)పై అవిశ్వాస తీర్మానం(No-confidence motion) నోటీసుల ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 18న స్రవంతి అవిశ్వాసంపై కార్పొరేటర్లు ఓటు వేయనున్నారు. నెల్లూరు కార్పొరేషన్ లో మొత్తం 53 మంది కార్పొరేటర్లు ఉండగా గతంలో వైసీపీకి పూర్తి పట్టు సాధించింది. దీంతో వైసీపీ మేయర్‌గా స్రవంతి ఎంపిక అయ్యారు. అయితే స్రవంతిని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బలపర్చారు. కానీ 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. ప్రస్తుతం 40 మంది కార్పొరేటర్లు వరకూ టీడీపీ మద్దతు ఇస్తున్నారు. ఈ మేరకు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ వ్యూహాలతో రక్తి కట్టిస్తున్నాయి. ఇటీవల ఐదుగురు కార్పొరేటర్లు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. అయితే టీడీపీ కూడా తన వ్యూహాలకు పదును పెట్టింది. దెబ్బతో వైసీపీలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లలో ఇద్దరు మళ్లీ టీడీపీ గూటికి చేరారు. అంతేకాకుండా నెల్లూరు 42వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్‌ను ఆకర్షించింది. దీంతో ఆయన సైతం సైకిల్ ఎక్కేశారు. ఇప్పటికే 38 మంది కార్పొరేటర్లను తిరుపతి క్యాంపు కార్యాలయానికి తరలించింది. మరో ఇద్దరు కార్పొరేటర్ల చేరికతో టీడీపీ బలం 40కి చేరింది. మరోవైపు వైసీపీకి మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లను కూడా ఆపార్టీ అధినేత జగన్ గోవాకు తరలించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ నెల 18న జరిగే అవిశ్వాసం తీర్మానం ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. మరి కార్పొరేటర్లు ఏ పార్టీకి జై కొడతారో చూడాలి.

Next Story