నెల్లూరులో అలర్ట్.. రైల్వే స్టేషన్ సహా అన్ని చోట్ల తనిఖీలు

by Vemula.Srinu Prasad |

నెల్లూరులో రైల్వే సిబ్బంది, పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు..

నెల్లూరులో అలర్ట్.. రైల్వే స్టేషన్ సహా అన్ని చోట్ల తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గాం ఉగ్రవాద దాడి(Pahalgham Terror Attack), భారత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్‌(Nellore Railway Station)లో ముందు జాగ్రత్త చర్యలు జీఆర్పీ పోలీసులు చేపట్టారు. రైల్వే స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. అలాగే భద్రతా విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ ‘‘పహల్గాం దాడి తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎస్ఆర్పీ సూచనలతో 100 మంది సిబ్బందితో నెల్లూరు రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేశాం. ఆరు బృందాలుగా డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీమ్‌తో సోదాలు నిర్వహించాం. స్థానిక పోలీసులతో కలిసి సంయుక్తంగా నా సబ్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టాం. అలాగే పోలీసులు హోటళ్ళు, లాడ్జీలు, బస్ స్టాండ్లు వంటి స్టేషన్ల వెలుపల ఉన్న ప్రాంతాలను కూడా తనిఖీ చేశారు.’’ అని తెలిపారు.

Next Story