- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
Nellore: అన్నదాతను ఆదుకోండి: జనసేన నేత కిషోర్

దిశ, నెల్లూరు: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన అన్నదాతను ఆదుకోవాలని కలెక్టర్ చక్రధర్‌బాబుకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వినపత్రం అందించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలో దాదాపు 4 వేల హెక్టార్ల పంట నష్టపోయిందని తెలిపారు. తొలికాపు చేతికొస్తుందని, ఉగాది పండగలో వెలివిరియాల్సిన గ్రామాలు వెలవెలబోతున్నాయని కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి త్వరగా పరిహారం అందించాలని కలెక్టర్‌కు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ విజ్ఞప్తి చేశారు.
అలాగే కందమూరు ఎస్సీ కాలనీలోని ఎంపీపీ స్కూల్లో ఆరు నెలలుగా టీచర్లు లేరని, దాంతో చదువుకునేందుకు పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటు నాడు-నేడు పనులు కూడా ఆగిపోయాని కలెక్టర్‌కు వివరించారు. సమస్యలపై కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కోరారు.