- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఎస్ పేట మండలంలో గుప్త నిధుల కోసం వేట
నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేట మండలంలో ఉన్న చిరమన గ్రామంలో గుప్త నిధుల కోసం సాగిన వేట స్థానికంగా కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేట మండలంలో ఉన్న చిరమన గ్రామంలో గుప్త నిధుల కోసం సాగిన వేట స్థానికంగా కలకలం రేపింది. గుప్త నిధుల కోసం పురాతన ఆలయాల (Ancient Temple) విధ్వంసం జరుగుతోందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో కూడా ఎన్నో పురాతన దేవాలయాలను గుప్త నిధుల కోసం నాశనం చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఏఎస్ పేట మండలం పరిధిలోని చిరమన గ్రామంలో చంద్రమౌళీశ్వర స్వామి (Chandra Moulishwara Swami) పురాతన ఆలయం ఉంది. అందులో అకస్మాత్తుగా దొంగలు పడ్డారనే విషయం గ్రామంలో కలకలం రేపింది. అయితే దేవాలయంలోని ఏ వస్తువును కూడా దుండగులు తాకలేదు. కేవలం ఒక శాసనం ఉన్న రాతిని తొలగించే ప్రయత్నం చేశారు. అయితే ఆ రాతి కింద గుప్త నిధులు ఉన్నాయనే అనుమానంతోనే నిందితులు ఇంతకు తెగబడ్డారని గ్రామస్తులు అనుకుంటున్నారు. నిధుల వేటలో భాగంగా గుడి తాళాలు పగలగొట్టి మరీ గుడిలోకి వెళ్లారని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఆలయంలోని సీసీ టీవీ కెమెరాలను కూడా పగలకొట్టి దుండగులు ఎత్తుకెళ్లారని అంటున్నారు. కొసమెరుపు ఏంటంటే సదరు దుండగులు ఎంత ప్రయత్నించినా గుడిలోని శాసనం ఉన్న రాతిని తొలగించలేకపోయారు. రాయి కదలకపోవడంతో చేసేదేమి లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పురాతన ఆలయం కావడం వల్ల ఇప్పటికే మూడుస నిధుల కోసం దుండగులు ప్రయత్నించారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు (Police) ఆలయాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు.






