అనుమతి లేకుండా ధర్నా..10 మంది వైసీపీ కీలక నేతలపై కేసు

by Vemula.Srinu Prasad |

నెల్లూరులో 10 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు అయ్యాయి...

అనుమతి లేకుండా ధర్నా..10 మంది వైసీపీ కీలక నేతలపై కేసు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరులో 10 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు అయ్యాయి. అనుమతులు లేకుండా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. నగరంలో ఎలాంటి సభలు, సమావేశాలు, నిరసనలు చేపట్టాలని అనుమతులు తప్పనిసరి అని పోలీసులు చెబుతున్నా.. వైసీపీ నాయకులు అవేవీ పట్టించుకోలేదు. ప్రశాంతంగా ఉన్న కలెక్టరేట్ వద్ద ఆందోళన పేరుతో అలజడి సృష్టించారు. దీంతో చిన్నబజార్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు తీసుకోవాలని, ఆ తర్వాతే ఆందోళనలు నిర్వహించాలని వైసీపీ నాయకులకు చెప్పినా పట్టించుకోకపోవడంపై సీరియస్ అయ్యారు. నెల్లూరుకు చెందిన 10 మంది నాయకులపై కేసు నమోదు చేశారు.

Next Story