Breaking: అనధికార కట్టడాలు కూల్చివేత

by Vemula.Srinu Prasad |

నెల్లూరులో అనధికార కట్టడాలను అధికారులు కూల్చివేశారు..

Breaking: అనధికార కట్టడాలు కూల్చివేత
X

దిశ, వెబ్ డెస్క్: అనధికార కట్టడాలను అధికారులు ఫోకస్ పెట్టారు. లిస్టు రెడీ చేసి కూల్చివేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉక్కుపాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. అనుమతుల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

నెల్లూరు(Nellore)లో అనుమతులు లేని నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు(Town planning officials) ఈ రోజు కూల్చివేశారు.వెంకటపురం, జేమ్స్ గార్డెన్ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా మూడు భవనాల్లో అదనపు అంతస్తులు నిర్మించారు. అయితే ఈ అంతస్తుల నిర్మాణంపై అభ్యంతరం చెబుతూ గతంలోనే నోటీసులు ఇచ్చారు. స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. కానీ భవన యజమానులు పట్టించుకోకపోవడంపై సీరియస్ అయ్యారు. అదనంగా నిర్మించిన అంతస్తులను బుధవారం తొలగించారు. నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతోనే తొలగింపు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా బిల్డింగులు, అంతస్తులు నిర్మించొద్దని సూచించారు. భవనాల నిర్మాణాలకు చాలా సంస్కరణలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని తెలిపారు.

Next Story