పోలీసులకు గుడ్ న్యూస్: పుట్టినరోజు, పెళ్లి రోజున స్పెషల్ లీవ్స్

by Gantepaka Srikanth |

నిరంతరం విధుల్లో ఉంటూ కుటుంబానికి దూరంగా గడిపే పోలీసు సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ తీపి కబురు అందించింది.

పోలీసులకు గుడ్ న్యూస్: పుట్టినరోజు, పెళ్లి రోజున స్పెషల్ లీవ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నిరంతరం విధుల్లో ఉంటూ కుటుంబానికి దూరంగా గడిపే పోలీసు సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ తీపి కబురు అందించింది. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన రోజులను కుటుంబంతో గడుపుకొనేలా ప్రత్యేక సెలవులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని పోలీసులందరికీ వారి పుట్టినరోజు (Birthday), పెళ్లిరోజు (Marriage Day) నాడు ప్రత్యేక సెలవు లభించనుంది. ఈ నిర్ణయం కేవలం కానిస్టేబుల్ స్థాయి వారికే కాకుండా, శాఖలోని అన్ని ర్యాంకుల అధికారులకు వర్తిస్తుందని డీజీపీ స్పష్టం చేశారు. ఈ సెలవుల అమలులో ఎలాంటి జాప్యం జరగకూడదని, ఆయా యూనిట్ అధికారులు తప్పనిసరిగా దీనిని అమలు చేయాలని డీజీపీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల పని ఒత్తిడిని తగ్గించడానికి, వారిలో ఉత్సాహాన్ని నింపడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని విభాగం భావిస్తోంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం వారి పనితీరును మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను పరిష్కరించడం పట్ల పోలీస్ అసోసియేషన్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story