ఏపీపై ప్రత్యేక దృష్టి సారించాలి : విజయసాయి రెడ్డి

by Thanuru Gopichand |

కేంద్ర బడ్జెట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు.

ఏపీపై ప్రత్యేక దృష్టి సారించాలి : విజయసాయి రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026-27పై (Central Budget 2026-27) ఏపీ రాష్ట్ర గంపెడాశలు పెట్టుకుంది. ఈ క్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) కేంద్ర బడ్జెట్ అంశంపై సోషల్ మీడియా (Social Media) వేదికగా స్పందించారు. ఏపీ (Andhra Pradesh) ప్రయోజనాలను కాపాడే పలు కీలక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ఏపీపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వరి, పొగాకు, కోకో పండించే రైతులకు ప్రత్యేక ఉపశమన చర్యలు ప్రకటించాలని విన్నవించారు.

మౌలిక సదుపాయాలపరంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు భారీగా గ్రాంట్లు కేటాయించాలని సూచించారు. అలాగే ఏపీని సమీప మెట్రో నగరాలతో అనుసంధానించేలా హై-స్పీడ్ రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు కొత్త కేంద్ర ప్రభుత్వ సంస్థలను (Central Institutions) స్థాపించాలని కోరారు. విభజన హామీల అమలుతో పాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఈ బడ్జెట్ కీలకం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు #Budget2026 హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Next Story