- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పీకర్ సోషల్ రెస్పాన్సిబుల్.. వావ్ అంటున్న ప్రజలు
by Muthe.Rajitha |
ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyanna Patrudu) తన బాధ్యతలే కాకుండా మరో కొత్త అవతారం ఎత్తారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyanna Patrudu) తన బాధ్యతలే కాకుండా మరో కొత్త అవతారం ఎత్తారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అయ్యన్న పాత్రుడు... అనకాపల్లి జిల్లా నర్సీపట్నం(Narsipatnam) మీదుగా వెళ్తున్నపుడు కొన్ని వాహనాలు భారీ లోడ్ తో వెళ్లడం గమనించాడు. వెంటనే తన కాన్వాయ్ ఆపి, ఆ వాహనాలలో తనిఖీలు నిర్వహించారు. ఆ వాహనాలు ఎలాంటి అనుమతులు లేకుండానే పరిమితికి మించి హెవీ లోడ్ తో వెళ్తున్నట్టు గమనించి వాటిని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. ఆ దారిలో తాళ్లపాలెం వంతెన శిథిలావస్థలో ఉందని, ఇలా భారీ లోడ్ తో వంతెనపై నుంచి వాహనాలు వెళితే అది కూలిపోయే ప్రమాదం ఉందని స్పీకర్ పేర్కొన్నారు. కాగా స్పీకర్ చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేసారు.
Next Story






