అనకాపల్లి ఘటనపై ఎస్పీ తుహిన్ సిన్హా సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

అనకాపల్లి కైలాసపట్నం పేలుడు ఘటన పై ఎస్పీ తుహిన్ సిన్హా క్లారిటీ ఇచ్చారు..

అనకాపల్లి ఘటనపై ఎస్పీ తుహిన్ సిన్హా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి కైలాసపట్నం పేలుడు ఘటన(Anakapalle Kailasapatnam explosion incident)లో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఎస్పీ తుహిన్ సిన్హా(SP Tuhin Sinha) స్పందించారు. నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో బాణా సంచా తయారీ కేంద్రం యజమాని సైతం మృతి చెందారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి బాణా సంచా కేంద్రం మేనేజర్‌పై కేసు నమోదు చేశామన్నారు. పెడ్డు-2లో ఆరుగురు వర్కర్లు పని చేస్తున్నారని చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పేలుడుకు ముందు నీళ్లకోసం కార్మికురాలు సునీత బయటకు రావడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. సునీతతో పాటు చిన్నారి ప్రవల్లిక బయటకు రావడంతో సురక్షితంగా ఉన్నారని, కాని చిన్నారి తల్లి నిర్మల మృతి చెందారని ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు.

Next Story