టీటీడీ మాజీ ఏవీఎస్ఓ కేసుపై ఎస్పీ కామెంట్స్

by Thanuru Gopichand |

పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడి మృతి. కేసు కోర్టు పరిధిలో ఉందన్న ఎస్పీ.

టీటీడీ మాజీ ఏవీఎస్ఓ కేసుపై ఎస్పీ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ పరకామణి (TTD Parakamani) చోరీ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడైన మాజీ ఏవీఎస్ఓ సతీష్ (AVSO Satish) గత నవంబరులో అనుమానాస్పదంగా మృతి చెందారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీంపంలో ఉన్న కోమలి గ్రామం వద్ద ఆయన మృతదేహం లభ్యమైన విషయం విదితమే. రైల్వేట్రాక్ సమీపంలో ఆయన విగతజీవిగా పడి ఉండడం గమనించి అప్పట్లో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలాన్ని డీఐజీ షిమోషి, అనంతపురం ఎస్పీ జగదీశ్ సందర్శించారు. సతీష్ కుమార్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. అంతేకాకుండా పలుమార్లు సీన్ రికన్ స్ట్రక్షన్ కూడా చేశారు. కేసు కీలక దశకు చేరిన క్రమంలోనే ఫిర్యాదుదారుడైన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీనిపై పలు ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే సతీష్ ది హత్య అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కాగా ఆత్మహత్య అనే కోణంలో కూడా వాదనలు వెలికివచ్చాయి.

అయితే ఓ మీడియా సమావేశంలో టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మరణం కేసు గురించి ఎస్పీ జగదీశ్ ను (SP Jagadeesh) ఓ విలేకరి ప్రశ్నించారు. అందుకు ఎస్పీ సమాధానం ఇచ్చారు. కేసు విచారణ కొనసాగుతోందని అన్నారు. అయితే కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు.

Next Story