- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగపూట రద్దీ నేపథ్యంలో 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగపూట రద్దీ నేపథ్యంలో 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది. జనవరి 9 నుండి 19 తేదీల మధ్య రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అదనంగా కేటాయించిన ప్రత్యేక రైళ్లలో శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07289), సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్(07290), సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్ (07288), వికారాబాద్-శ్రీకాకుళం రోడ్(07294), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07291), సికింద్రాబాద్- శ్రీకాకుళం రోడ్(07292), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07293), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్ (07295) ఉన్నాయి. ఈ రైళ్లు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయణపాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామల్ కోట్, అన్నవరం, తుని, ఎలమంచిలి, దువ్వాడ, అనకాపల్లి, కొత్తవలస, విజయనగరం, పెందుర్తి, చీపురు పల్లి స్టాపుల్లో ఆగుతాయని రైల్వేశాఖ స్పష్టం చేసింది.






