- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి.. మరో నోటిఫికేషన్! హోం మంత్రి అనిత
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు. రాష్ట్రంలో 20 వేల పోలీస్ ఉద్యోగాల కొరత ఉందని, దానికి అనుగుణంగా కార్యాచరణ పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. దీంతో త్వరలోనే కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా గత ప్రభుత్వం 6,100 పోలీస్ ఉద్యోగాల భర్తీకి 2022 నవంబర్ 28 న నోటిఫికేషన్ విడుదల చేయగా.. గతేడాది జనవరి 22 న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 4,58,219 మంది హాజరయ్యారు. ఫలితాలు గతేడాది ఫిబ్రవరి 5 న వెలువడ్డాయి. తదుపరి దశలో 95,209 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అదే ఏడాది ఫిజికల్ టెస్టులు నిర్వహించాల్సి ఉండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో ఈ ప్రక్రియ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునః ప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్డీయే గవర్నమెంట్ ఏర్పాట్లు చేయనుంది.






