దారుణం.. తండ్రిని నరికి చంపిన కొడుకు

by Naga Rani Yarlagadda |

వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తండ్రి ఆలనా పాలనా చూసుకోవాల్సిన కొడుకే.. కాలయముడయ్యాడు.

దారుణం.. తండ్రిని నరికి చంపిన కొడుకు
X

దిశ, వెబ్‌డెస్క్: వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తండ్రి ఆలనా పాలనా చూసుకోవాల్సిన కొడుకే.. కాలయముడయ్యాడు. మద్యంమత్తులో ఇంటికొచ్చిన కొడుకు.. పక్షవాతంతో మంచం పట్టిన తండ్రిని రెండు ముక్కలుగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మామిడి సత్యం (62) పక్షవాతంతో కాలు, చెయ్యి పడిపోయింది. దీంతో మంచానికే పరిమితమయ్యాడు. అతని కొడుకు రాము భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

అయితే.. మద్యానికి బానిసైన కొడుకు శనివారం మధ్యాహ్నం ఫుల్లుగా తాగి ఇంటికెళ్లాడు. మంచంపై ఉన్న తండ్రి తలను పదునైన కత్తితో నరకడంతో తల, మొండెం వేరైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామును అరెస్ట చేశారు.

Next Story