స్పా మసాజ్ ముసుగులో వ్యభిచారం... పోలీసుల ఆకస్మిక దాడి

by Vemula.Srinu Prasad |

రాజమండ్రిలో కొన్ని స్పా మాసాజ్ సెంటర్లు వ్యభిచార గృహాలు నడుపుతున్నాయి...

స్పా మసాజ్ ముసుగులో వ్యభిచారం... పోలీసుల ఆకస్మిక దాడి
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి(Rajahmundry)లో కొన్ని స్పా మాసాజ్(Spa massage) సెంటర్లు వ్యభిచార(Adultery) గృహాలు నడుపుతున్నాయి. బయటకు వెల్ నెస్, మసాజ్ పేరుతో బోర్డులు పెడుతున్నాయి. తీరా లోపల చూస్తే చీకటి వ్యవహారాలు కొనసాగుతున్నాయి. శారీరకంగా అలసిపోయిన వారికి, కండరాలు బిసుకుపోయి నొప్పులతో బాధపడుతున్నావారికి ఉపశమనం కలిగిస్తామని చెప్పి ఇతర రాష్ట్రాలకు చెందని యువతులతో విచ్చలవిడిగా వ్యభిచారం చేయిస్తున్నారు.

రాజమండ్రి ప్రకాశ్ నగర్‌లోని ఫెదర్ టచ్ స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్లు సోమవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన స్పా సెంటర్‌పై పోలీసు సిబ్బంది ఆకస్మిక దాడి చేశారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు యువతులు, ఐదుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులు ఉన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇదే స్పా సెంటర్‌పై గతంలో దాడి చేసి కేసు నమోదు చేసినట్లు తేలింది. మళ్లీ ఇదే సెంటర్‌లో స్పా మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తుండటంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Next Story