- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉర్దూ స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్థులు
కర్నూలు ఉర్దూ పాఠశాలలో పాములుకలకలం రేపాయి. ...

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు ఉర్దూ పాఠశాల(Kurnool Urdu School)లో పాములు(Snakes) కలకలం రేపాయి. ఈ రోజు స్కూలుకు వెళ్లిన విద్యార్థులకు పాఠశాల ఆవరణలో రెండు పాములు కనిపించాయి. దీంతో స్నేక్ కేచర్‌కు సమాచారం అందించారు. పాఠశాల వద్దకు వెళ్లిన స్నేక్ కేచర్ చాకచక్యంగా పాములను పట్టుకుని అడవుల్లో వదిలేశారు. అయితే రెండు నెలల క్రితం స్కూలు విద్యార్థిని బ్యాగులోకి పాము చొరబడిందని టీచర్లు గుర్తు చేశారు. పాఠశాల ప్రాంగణంలో పాములు తరచూ తిరుగుతున్నాయని, కర్రతో చప్పుడు చేసుకుంటూ తాము తిరుగుతున్నామని విద్యార్థులు తెలిపారు. స్కూలు గ్రౌండ్ సమీపంలో చెట్లు, పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు ఉన్నాయని, దాని వల్లే ప్రతి రోజూ పాములు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదులకు వెళ్లాలంటే తాము భయపడుతున్నామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.






