ఏపీ లిక్కర్ స్కామ్.. 6 గంటలపాటు మాజీ మంత్రిని ప్రశ్నించిన సిట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-22 13:18:11  IST  )

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో ఇప్పటికే అరెస్టైన నిందితులు విచారణలో చెప్పిన వివరాల ఆధారంగా మాజీ మంత్రి, వైసీపీ నేత కె. నారాయణస్వామి (Narayana Swamy)ని సిట్ అధికారులు ప్రశ్నించారు.

ఏపీ లిక్కర్ స్కామ్.. 6 గంటలపాటు మాజీ మంత్రిని ప్రశ్నించిన సిట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో ఇప్పటికే అరెస్టైన నిందితులు విచారణలో చెప్పిన వివరాల ఆధారంగా మాజీ మంత్రి, వైసీపీ నేత కె. నారాయణస్వామి (Narayana Swamy)ని సిట్ అధికారులు ప్రశ్నించారు. పుత్తూరులోని ఆయన నివాసంలోనే విచారణ చేసిన సిట్.. సుమారు 6 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీలో మార్పులు, ఆర్డర్స్ ఇవ్వడంలో ఆన్లైన్ విధానాన్ని తీసి మాన్యువల్ పద్ధతిని అమలు చేయడంపైనే ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.

6 గంటల విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నారాయణస్వామి.. తనను నాలుగు ప్రశ్నలు అడిగారని, అన్నింటికీ సమాధానమిచ్చానని తెలిపారు. ఈ కేసు విచారణలో సిట్ అధికారులు ఎప్పుడు విచారించినా సహకరిస్తానని పేర్కొన్నారు. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సిట్ నోటీస్ ఇచ్చిందని చెప్పారు. కాగా.. సిట్ అడిగిన ప్రశ్నల్లో చాలా ప్రశ్నలకు తనకేం తెలియదని నారాయణస్వామి బదులిచ్చినట్లు తెలుస్తోంది. డిజిటల్ చెల్లింపుల విషయం పైవాళ్ల నిర్ణయమని, మద్యం పాలసీలో మార్పుల గురించి తనకేం తెలియదని చెప్పినట్లు సమాచారం.

Next Story