కీలక దశకు కల్తీ నెయ్యి కేసు: హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తున్న సిట్

by Vemula.Srinu Prasad |

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనకు సంబంధించి సిట్ అధికారులు దూకుడు పెంచారు..

కీలక దశకు కల్తీ నెయ్యి కేసు: హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తున్న సిట్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి లడ్డూ(Srivari Laddu)లో కల్తీ నెయ్యి ఘటనకు సంబంధించి సిట్ అధికారులు దూకుడు పెంచారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(TTD Former Chairman Subbareddy)ని హైదరాబాద్‌(Hyderabad)లో ఈ రోజు విచారిస్తున్నారు. విజయవాడ(Vijayawada) రావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ తాను రాలేనని చెప్పడంతో సిట్ అధికారులు హైదరాబాద్ వెళ్లి ఆయన ఇంట్లోనే ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా పని చేసిన సమయంలో లడ్డూ తయారీ నెయ్యికి సంబంధించి అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. టీటీడీకి నెయ్యి సరఫరా, ఆయా సంస్థలతో ఒప్పందాలు, చైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు వంటి అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం.

కాగా కల్తీ నెయ్యి కేసుకు సంబందించి ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను అరెస్ట్ చేసి విచారించారు. అయితే ఈ విచారణలో పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైవీ సుబ్బారెడ్డిని సైతం విచారిస్తున్నట్లు సమాచారం. వైవీ విచారణ అనంతరం ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో చూడాలి.

Next Story