YS Jagan : సింగయ్య మృతి.. YS జగన్‌కు పోలీసుల నోటీసులు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-24 14:20:47  IST  )

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌(YS Jagan)కు నల్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

YS Jagan : సింగయ్య మృతి.. YS జగన్‌కు పోలీసుల నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌(YS Jagan)కు నల్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ పల్నాడు(Palnadu Tour) జిల్లా సత్తెనపల్లి రెంటపాళ్ల పర్యటనలో చీలి సింగయ్య(Singaiah) (53) అనే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త జగన్ కారు కింద పడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గుంటూరు పోలీసులు జగన్‌తో సహా ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. డ్రైవర్ రమణారెడ్డిని A1గా, జగన్‌ను A2గా, కారు యజమాని, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిలను నిందితులుగా చేర్చారు. సింగయ్య ఏటుకూరు బైపాస్ రోడ్డు వద్ద జగన్ మీద పూలు చల్లేందుకు ముందుకు వెళ్తూ జారి కారు కింద పడ్డారని.. వీడియో ఆధారాలు, సీసీటీవీ, డ్రోన్ ఫుటేజీలో జగన్ కారే సింగయ్యను ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా నేడు పోలీసులు తాడేపల్లిగూడెంలోని జగన్‌ కార్యాలయానికి వెళ్ళగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో పార్టీ ఆఫీసు కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు. కాగా ఆయనతోపాటు ఆయన భద్రతా సిబ్బంది, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను కూడా విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Next Story