Breaking: శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనలో షాకింగ్ విషయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-08 13:07:12  IST  )

శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి..

Breaking: శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనలో షాకింగ్ విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ నెయ్యి(Adulterated ghee) ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సిట్ అధికారులు(SIT officials) కీలక విషయాలు రాబట్టారు. ఏ16 నిందితుడు అజయ్ కుమార్ సుగంధ్ విచారణలో సంచలన విషయాలు బయటపెట్టారు. బోలే బాబా డెయిరీలో తయారీ అయ్యే నెయ్యిలో పామాయిల్(Palm oil) ఫ్లేవర్ ఉన్నట్లు తెలిపారు. అజయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఈ విషయాలన్నింటిని పొందుపర్చారు. లడ్డూ పోటు కోసం బోలే బాబా సరఫరా చేసిన నెయ్యిలో 90 శాతం పామాయిల్ కలిసినట్లు సిట్ గుర్తించింది. ఏడేళ్లుగా బోలే బాబా కంపెనీకి అజయ్ కుమార్ సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో లడ్డూ కల్తీ విషయం బయటకు వచ్చింది. మోన్ గ్రిసరాయిడ్స్, అసిటిక్ యాసిడ్ యాస్టర్‌తో పాటు పామాయిల్ తయారీలో కావాల్సిన ముడిరసాయనాలను అజయ్ ద్వారా బోలే బాబా కంపెనీ కొనుగోలు చేసింది. ఈ కెమికల్స్ అమ్మకంతో రూ. కోట్లలో ఆదాయం పొందినట్లు అజయ్ కుమార్ ఒప్పుకున్నారని రిమాండ్ రిపోర్టులో సిట్ పొందుపర్చింది. అజయ్ పంపిన కెమికల్స్‌తోనే బోలే బాబా కంపెనీ పామాయిల్ తయారీ చేసి నెయ్యిగా భ్రమింపజేసి తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి పంపారు. అయితే దీన్నే నెయ్యిగా వినియోగించారా లేదా అనేది తేలాల్సి ఉంది.

Next Story