YS Sharmila : షర్మిల దీక్ష భగ్నం

by Muthe.Rajitha |

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు(AP PCC Cheif) వైఎస్ షర్మిల(YS Sharmila) నేడు విశాఖ స్టీల్ ప్లాంట్(Vishakha Steel Plant) ఎదుట నిరాహరదీక్షకు దిగిన విషయం తెలిసిందే.

YS Sharmila : షర్మిల దీక్ష భగ్నం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు(AP PCC Cheif) వైఎస్ షర్మిల(YS Sharmila) నేడు విశాఖ స్టీల్ ప్లాంట్(Vishakha Steel Plant) ఎదుట నిరాహరదీక్షకు దిగిన విషయం తెలిసిందే. అయితే కొద్దిసేపటి క్రితం షర్మిలను దీక్ష శిబిరం నుంచి పోలీసులు తరలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 2 వేల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ప్లాంట్ ఎదురుగా నిరాహారదీక్షలో కూర్చున్నారు. కాగా ఆమె దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను కార్మికులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టి షర్మిలను అక్కడి నుంచి తరలించారు.

Next Story