- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flash News: వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం.. దూసుకొస్తున్న మోంతా
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఇది పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ అండ్ నికోబార్ దీవులు)కి 420 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 990 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 990 కిలోమీటర్ల దూరంలో, కాకినాడలో 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని APSDMA వెల్లడించింది.
ఈ వాయుగుండం ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా బలపడి.. ఎల్లుండి ఉదయానికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే ఛాన్స్ ఉందని పేర్కొంది. తదుపరి 48 గంటల్లో ఏపీ తీరం వైపు కదిలే ఛాన్స్ ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా బంగాళాఖాతంలో మరికొద్దిగంటల్లో ఏర్పడనున్న తుపానుకు భారత వాతావరణ శాఖ (IMD) మోంతా అని పేరుపెట్టింది.






