- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుధారాణి కేసులో వెలుగులోకి సెన్సేషనల్ విషయాలు
సుధారాణి కేసులో సెన్సేషనల్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..

దిశ, వెబ్ డెస్క్: గార్మెంట్ కంపెనీలో డబ్బులు పెడితే అధిక వడ్డీలొస్తాయని చాలా మందిని బురిడీ కొట్టించిన సుధారాణి వ్యవహారం రెండు రోజులుగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. విశాఖకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. సుధారాణి మోసం లిస్టులో ఐఏఎస్‌లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, చాలా వస్త్ర వ్యాపారుల సైతం ఉన్నట్లు గుర్తించారు. . GST, TDS ఇన్‌వాయిస్‌లు సైతం మార్చి కస్టమర్లను బురిడీ కొట్టించినట్లు కూడా తేలింది. అలా రూ. 180 కోట్లు సుధారాణి మోసానికి పాల్పడిట్లు నిర్దారణ అయింది. అలాగే సంధ్యారాణి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. కందుకూరులో భూమి, విజయవాడలో కమర్షియల్ కాంప్లెక్స్, హైదరాబాద్‌లో ఖరీదైన ప్రదేశాలు, 9 ప్లాట్లు ఉన్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. పలువురు ఆడిటర్లను ఆర్థిక నేరాల విభాగం పోలీసులు విచారిస్తున్నారు.






