‘వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh) రాజకీయాల్లో అమరావతి పై ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

‘వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) రాజకీయాల్లో అమరావతి పై ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమరావతి(Amarawati) మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్(MSK Prasad) తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు మహిళలపై అశ్లీల వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజధాని మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రసాద్ డిమాండ్ చేశారు.

అమరావతి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రమని ఎంఎస్‌కే ప్రసాద్ తెలిపారు. తన కుటుంబంతో సహా బంధువులంతా ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ తరుణంలో అమరావతిపై నీచ ప్రచారానికి దిగిన వ్యక్తులకు కనీసం ఆ ప్రాంత చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక విశేషాలు కూడా తెలియవన్నారు. నాటి అమరావతి శిల్పకళ రీతి.. బౌద్ధం విస్తరించిన శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాల్లో ఆదరణ పొందింది. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతం పై నీచ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Next Story