‘మీ ప్రయాణం ఓ ఆశా ద్వీపం’ ..పవన్‌కు మద్దతుగా సీనియర్ నటుడు?

by Disha Web Desk 18 |
‘మీ ప్రయాణం ఓ ఆశా ద్వీపం’ ..పవన్‌కు మద్దతుగా సీనియర్ నటుడు?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల నేతలు ప్రచారం జోరు పెంచారు. ఈ క్రమంలోనే పార్టీల నేతలు సభలు సమావేశాలు, రోడ్‌షోలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హోరాహోరిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున సినీ నటులు ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్‌కు మద్దతుగా ట్వీట్టర్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. జనసేనాని గెలుపు కోసం కుటుంబం సైతం ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా సీనియర్ నటుడు నరేష్ ట్విట్టర్ వేదికగా జనసేనకు మద్దతు ప్రకటించారు. ఏపీ అభివృద్ధి కోసం ఏర్పాటైన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను స్థిరమైన మద్దతుదారునిగా కొనసాగుతున్నా అని తెలిపారు. మీ ప్రయాణం ఓ ఆశా ద్వీపం అన్నారు. మీ మిషన్‌కు మేము మద్దతుగా నిలుస్తాం. మీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని చెప్పారు. ఈ క్రమంలోనే ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు.

Read More...

ప్రధాని మోడీ రోడ్ షోకు ఇసుకేస్తే రాలనంత జనం (వీడియో)

Next Story