Dastagiri : వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి భద్రత కట్టుదిట్టం

by Muthe.Rajitha |

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్యకేసు(YS Vivekananda Murder Case)లో సాక్షులు అనుమానస్పదంగా మరణిస్తుండటం కలకలం రేపుతోంది.

Dastagiri : వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి భద్రత కట్టుదిట్టం
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్యకేసుYS Vivekananda Murder Case)లో సాక్షులు అనుమానస్పదంగా మరణిస్తుండటం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో ఈ హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి(Dastagiri)కి ప్రస్తుతం ప్రాణభయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. కాగా తనకు మరింత భద్రత కల్పించాలని పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నాడు. దీంతో దస్తగిరికి భద్రత పెంచుతూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 1+1 గన్ మెన్స్ ఉండగా.. ఇకనుంచి 2+2 గన్ మెన్స్ భద్రత కల్పించినట్టు కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం నుంచి భద్రత సిబ్బంది విధుల్లో చేరినట్టు సమాచారం.

కాగా ఈకేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొన్న కసనూరుకు చెందిన శ్రీనివాసుల రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రత్యక్ష సాక్షిగా ఉన్న దేవిరెడ్డి అనుచరుడు కల్లూరు గంగాధర్‌ రెడ్డి తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో 2022లో మృతి చెందారు. వివేకా‌కు వైద్య పరీక్షలు చేయించిన జగన్‌ మామ ఈసీ గంగిరెడ్డి 2022లో చనిపోయారు. అదేవిధంగా హత్య జరిగిన రోజు రాత్రి వివేకా తలకు బ్యాండేజీ వేసిన డాక్టర్‌ వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి ఇటీవలే తీవ్ర అనారోగ్యంతో మరణించారు. మరో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్‌మన్‌ రంగయ్య ఈ నెల 6న అనారోగ్యంతో కడప రిమ్స్‌లో కన్నుమూశాడు. ఈ క్రమంలోనే తాను అప్రూవర్‌గా మారినందున భద్రత కల్పించాలని దస్తగిరి కడప ఎస్పీ (SP) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

Next Story