Free gas Cylender: ఫ్రీగా రెండో సిలిండర్ .. ఏపీలో నేటి నుంచే బుకింగ్ మొదలు

by Thanuru Gopichand |

ఏపీలో రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు ఈరోజు నుంచి అందించనున్నారు

Free gas Cylender: ఫ్రీగా రెండో సిలిండర్ .. ఏపీలో నేటి నుంచే బుకింగ్ మొదలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో (Ap) రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు ఈరోజు నుంచి అందించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 31 మధ్య ఈ రెండో సిలిండర్ను అందిస్తారు. ఈ విధంగా ప్రతి కుటుంబానికి ఏడాదిలో మొత్తం మూడు ఉచిత సిలిండర్లు లభించనున్నాయి. తొలి విడతలో దాదాపు 90 లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుకున్నారు. దీనికి సంబంధించిన నగదు మొత్తాన్ని ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలకు ముందుగానే చెల్లించింది. పట్టణ ప్రాంతాల్లో అయితే బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుక్ చేసిన 48 గంటల లోపు సిలిండర్ డెలివరీ (Delivery) చేస్తారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు లబ్ధిదారులు చెల్లించిన పూర్తి సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తారు. అర్హత ఉండి ఉచిత గ్యాస్ సిలిండర్ అందనివారు 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.

Next Story