- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో స్క్రబ్ టైపస్ వైరస్ కలకలం.. హోంమంత్రి అనిత కీలక ప్రకటన
రాష్ట్రంలో స్క్రబ్ టైపస్ వైరస్ కలకలం రేపింది..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో స్క్రబ్ టైపస్ వైరస్(Scrub typhus virus) కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ పట్ల ఆందోళన వద్దని హోంమంత్రి అనిత(Home Minister Anita) అంటున్నారు. విజయనగరం(Vizianagaram)లో జిల్లాలో పర్యటించిన ఆమె స్క్రబ్ టైపస్ వైరస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏమైనా లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి టెస్ట్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. విజయనగరం వెనుకబడిన జిల్లా కాదని, వ్యవహాయ, ఇండస్ట్రీ పరంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. వచ్చే ఖరీఫ్, రబీకు సన్నద్ధమవుతున్నామని, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగం మీద చంద్రబాబు దృష్టి సారించారని, ధ్యానం కొనుగోళ్లలో అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హార్టికల్చర్ ప్రోత్సహించే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
గత టీడీపీలో హౌసింగ్ స్కీమ్ కింద రూపాయి పడి మిగతా డబ్బులు రాలేదో... వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేశామని చెప్పారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యకు పరిష్కారం చూపెడతామని, పేదలకు రూరల్లో మూడు సెంట్లు...అర్బన్‌లో 2 సెంట్లు స్థలం సర్వే చేస్తూ వారికి స్థలాన్ని కేటాయిస్తున్నామని వెల్లడించారు. స్థలం ఇచ్చిన ఏడాదిలోపే ఇళ్ల నిర్మాణం చేపడతామని హోంమంత్రి అని హామీ ఇచ్చారు.






