- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరద ముప్పు.. ఏపీలోని ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు
by Ajay Maddhiboyina |
వాయుగుండం కారణంగాక ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉంది.

X
దిశ, వెబ్ డెస్క్: వాయుగుండం కారణంగాక ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉంది. వంశధార నదిలోకి వరదనీరు ఎక్కువగా చేరుతుండటంతో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉండటంతో జిల్లాల్లోని 10 మండలాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలాకి, కొత్తూరు, హిరమండలం, శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట, నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస మండలాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
Next Story






