విద్యార్థులకు అలర్ట్.. ఆ కోర్సుల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

by Malleboina Mahesh |

ఏపీ ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్కు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది.

విద్యార్థులకు అలర్ట్.. ఆ కోర్సుల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్ జారీ యింది. ఏపీ ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్కు ఉన్నత విద్యామండలి (Higher Education) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం బీఈడీ (BED)లో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్సెట్ కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ నెల 9-12 వరకు, ధ్రువపత్రాల పరిశీలనకు 10-13 వరకు, వెబ్ ఆప్షన్స్ నమోదుకు 13-15 వరకు, వెబ్ ఆప్షన్ మార్పునకు 16న అవకాశం కల్పించారు.

అలాగే మొదటి విడత సీట్ల కేటాయింపు ఈ నెల 18న జరగనుంది. అలాగే 19, 20 తేదీల్లో కళాశాలల్లో చేరేందుకు అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉంటే వ్యాయామ విద్య కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన పీఈసెట్ కౌన్సిలింగ్ ఈ నెల 10 నుంచి జరగనుంది. రిజిస్ట్రేషన్కు ఈ నెల 10-13 వరకు, ధ్రువపత్రాల పరిశీలనకు 11-14 వరకు, వెబ్ ఆప్షన్ల నమోదుకు 14-16 వరకు, ఆప్షన్ మార్పునకు 17న అవకాశం ఇచ్చారు. 19న సీట్ల కేటాయింపు, 22, 23 తేదీల్లో కళాశాలల్లో చేరేందుకు అవకాశం కల్పించనున్నట్లు విద్యామండలి విడుదల చేసిన షెడ్యూల్ లో పేర్కొన్నారు.

Next Story