- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి : రాష్ట్రపతికి లోకేశ్ ఫిర్యాదు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరినట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరినట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను రాష్ట్రపతికి వివరించినట్లు లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతును వైసీపీ నొక్కుతోందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాంకు పాల్పడలేదని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం సీఐడీ వద్ద లేవని తెలిపారు. ఈ మేరకు పలు ఆధారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయంటే ఆయన నిజాయితీకి నిదర్శనం అని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేయడం, ఆందోళనలు కూడా చేసే స్వేచ్ఛలేకుండా చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్రంలో పరిస్థితులను జోక్యం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని రాష్ట్రపతికి తెలియజేశారు. తమను రోడ్డుమీదకు రాకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేసినట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.






