- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి వేడుకలు.. అక్కడ వినూత్న పందేలు
ఏపీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది కోడి పందేలు. అయితే ఈ సంక్రాంతి వేడుకల్లో ఎడ్ల పందేలు, కోడి పందేలు వింటూనే ఉంటాం. కానీ, రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు కోడి పందేలకే పరిమితం కాకుండా విభిన్న శౌర్య క్రీడలతో సందడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో పందుల ఫైట్ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పందులను రెండు టీమ్స్ గా చేసి ఇరువైపులా నుంచి ఒకేసారి పందులను వదులుతారు. అలా తలపడగా చివరికి ఏది నిలబడుతుందో దాన్ని విన్నర్ గా ప్రకటిస్తారు. అయితే పందుల పోటీలను చూడటానికి జనం భారీగా తరలివెళ్లారు. ఇక, కృష్ణా జిల్లా కూచిపూడిలో నిర్వహించిన పొట్టేళ్ల పందేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పందెం రాయుళ్లతో పాటు వీక్షకులు కూడా ఈ పోటీలను చూసేందుకు భారీగా తరలివచ్చారు. పల్లెల్లో ఈ వినూత్న పందేలు పండుగ ఉత్సహాన్ని రెట్టింపు చేశాయి.






