- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ మద్యం కేసు అరెస్ట్‌లపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
ఏపీ మద్యం కేసు అరెస్ట్‌లపై సజ్జల సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కేసు(AP liquor case)లో వైసీపీ(Ycp) నేతలు వరుసగా అరెస్ట్ కావడం, త్వరలోనే అసలు సూత్రదారి కూడా జైలుకు వెళతారని కూటమి నేతలు అంటున్న నేపథ్యంలో గత ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(YSRCP leader Sajjala Ramakrishna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ చానల్ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ వైసీపీ(Ycp) బలంగా లేని రోజుల్లోనే జగన్‌ను అరెస్ట్ చేస్తే భయపడేదని, ఇప్పుడు ఇంకా గట్టిగా నిలబడతామని చెప్పారు. వైఎస్ జగన్ ఇప్పుడు జనం గొంతుగా మారారని తెలిపారు. జగన్ గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కల్తీ లిక్కర్‌తో 30 మంది చనిపోయారని అంటున్నారని, అది నిజమైతే విచారణ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. బట్టీలు పెట్టి కాల్చితే లిక్కర్ రాదని, దానికి డిస్టిలరీస్ ఉంటాయని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-19 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్‌ను ఓపెన్ చేస్తామన్నారు. కూటమి నేతలు మాదిరిగా అక్రమంగా ఎవరినీ అరెస్ట్ చేయమని చెప్పారు. వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే సత్తా లేకే కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని, వెనకడుగేసేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశార
సినిమాలో మాదిరిగా కథ అల్లారని, కాకపోతే లింకు లేదని సజ్జల ఎద్దేవా చేశారు. ముందే క్లైమాక్స్ రాశారని, ఓపెనింగ్ ఏంటనేది చెప్పలేదన్నారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో చెప్పలేదని, అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పాలసీ మార్చితే అవినీతి ఎలా అవుతుందన్నారు. ప్రైవేటు దుకాణాల్లో లిక్కర్ అమ్మితే అక్కడి కచ్చితంగా అవినీతి జరుగుతుందన్నారు. మ్యాన్యువల్ ప్రకారం లిక్కర్ అమ్మడం తప్పు కాదున్నారు. ఇండెండ్ వ్యహారంలో ఎలాంటి తేడాలు లేవని, చెల్లింపుల్లో ఆలస్యంతోనే కొన్ని బ్రాండ్లు నిలిచిపోయానని సజ్జల తెలిపారు.






