సజ్జల భార్గవ కేసు.. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ హైకోర్టు హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ (YCP) లేక్కలేని దురాగతాలకు పాల్పడింది.

సజ్జల భార్గవ కేసు.. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ హైకోర్టు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ (YCP) లేక్కలేని దురాగతాలకు పాల్పడింది. ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా ఆ పార్టీ సోషల్ మీడియా (Social Media) విషాన్ని చిమ్ముతూ అధికార మదంతో విర్రవీగింది. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యమంత్రి (CM), ఉప ముఖ్యమంత్రి (Deputy CM), పలువురు మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా (Social Media) వేదికగా దూషిస్తూ, అసభ్య పోస్టులు పెట్టిన వ్యవహారంపై సజ్జల భార్గవ రెడ్డి (Sajjala Bhargava Reddy)పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు (AP High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది.

పార్టీలు, వ్యక్తిగత కక్షలతో ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకునేందుకు పెట్టే పోస్టుల కారణంగా చివరకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలు లాభపడుతున్నాయని వ్యాఖ్యానించింది. రోజురోజుకు మితిమీరుతోన్న అసభ్యకర పోస్టులు సభ్యసమాజానికి శ్రేయస్కరం కాదని.. వాటిని వీలైనంత త్వరాగా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని కోర్టు పేర్కొంది. అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు చట్టం అనుమతిస్తోందనే కారణంతో వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్య పోస్టులు పెట్టడానికి ఎంతమాత్రం వీలు లేదని హైకోర్టు కామెంట్ చేసింది. అదేవిధంగా సోషల్ మీడియా (Social Media)లో అసభ్యకర పోస్టుల నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పూర్తి డేటా తమకు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని (Government of Andhra Pradesh) ఆదేశించింది. సజ్జల భార్గవ ముందస్తు బెయిల్ పిటిషన్ తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

Next Story