అపస్మారక స్థితిలోకి ఆర్టీసీ డ్రైవర్.. సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

by Ramesh Goud |

అప్మారస్థితిలోకి వెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ (RTC Driver) ను ఓ కానిస్టేబుల్ (Constable) సీపీఆర్ (CPR) చేసి కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో (Video) సోషల్ మీడియా (Social Media)లో వైరల్ (Viral) గా మారింది.

అపస్మారక స్థితిలోకి ఆర్టీసీ డ్రైవర్.. సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
X

దిశ, వెబ్ డెస్క్: అప్మారస్థితిలోకి వెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ (RTC Driver) ను ఓ కానిస్టేబుల్ (Constable) సీపీఆర్ (CPR) చేసి కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో (Video) సోషల్ మీడియా (Social Media)లో వైరల్ (Viral) గా మారింది. దీంతో ఆ కానిస్టేబుల్ పై ప్రశంసల వర్షం (Shower of praise) కురుస్తోంది. నందిగామ (Nandigama) లో ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్న పుల్లారావు(Pulla Rao) అకస్మాత్తుగా కిందపడిపోయాడు. అపస్మారక స్థితి (UnConscious) లోకి వెళ్లాడని గమణించిన స్థానికులు టోల్ ఫ్రీ నంబర్ (Toll Free Number) 112 కు కాల్ చేశారు. కాల్ కు స్పందించిన కానిస్టేబుల్ సంతోష్ (Constable Santhosh) హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాడు.

అపస్మారకంగా పడిపోయిన పుల్లారావుకు సీపీఆర్ చేయడం ప్రారంభించారు. అంతేగాక అంబులెన్సు కు కూడా కాల్ చేశారు. అంబులెన్స్ (Ambulence) వచ్చే లోపు సీపీఆర్ చేయడంతో పుల్లారావు పరిస్థితి కొంత మెరుగుపడింది. అనంతరం ఆయనను దగ్గర లోని ఆసుపత్రి (Hospital) కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆర్టీసీ డ్రైవర్ పుల్లారావు ఆరోగ్యం నిలకడగా ఉందని వెద్యులు (Doctors) ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో సమయానికి స్పందించి సీపీఆర్ చేసిన కానిస్టేబుల్ సంతోష్ ను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వం(Government) గుర్తించాలని కోరుతున్నారు.

Next Story