మా వల్ల కాదు.. ప్రైవేటుకు ఇస్తే మంచిది: ఏపీఎస్ ఆర్టీసీ సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |

ఏపీఎస్ ఆర్టీసీలో ప్రైవేటీకరణ అనేది తప్పనిసరి అని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కారణం కేంద్రప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, బస్సుపై ఇన్వెస్టిమెంట్ రూ. కోటి 60 లక్షలు అవుతుందని ఆయన తెలిపారు. అయితే ఏపీఎస్ ఆర్టీసీ గాని, ప్రభుత్వం గాని కొనుగోలు చేసే పరిస్థితిలో లేదన్నారు..

మా వల్ల కాదు.. ప్రైవేటుకు ఇస్తే మంచిది: ఏపీఎస్ ఆర్టీసీ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ ఆర్టీసీ(Apsrtc)లో ప్రైవేటీకరణ(Privatization) అనేది తప్పనిసరి అని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కారణం కేంద్రప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, బస్సుపై ఇన్వెస్టిమెంట్ రూ. కోటి 60 లక్షలు అవుతుందని ఆయన తెలిపారు. అయితే ఏపీఎస్ ఆర్టీసీ గాని, ప్రభుత్వం గాని కొనుగోలు చేసే పరిస్థితిలో లేదన్నారు. అందువల్ల ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తే...వాళ్లు పెట్టుబడి పెట్టి బస్సులను నడిపిస్తారని, దాని వల్ల ఆర్టీసీకి అదనపు భారం తగ్గుందని తెలిపారు. రాష్ట్రంలో 10 వేల బస్సులు సేవలు అందిస్తున్నాయని, వీటి స్థానంలో పది వేల ఎలక్ట్రికల్ బస్సులు కావాలని చెప్పారు. పది వేల బస్సులు కావాలంటే సుమారు రూ. 15 వేల కోట్లు అవుతుందని, ప్రస్తుతం ఆర్టీసీ వద్ద అంత ఆర్థిక పరిస్థితి లేదని కొనకళ్ల పేర్కొన్నారు.

ఉచిత సేవలతో ఆర్థిక భారం


మహిళలకు ఉచిత బస్సు సేవలతో ఆర్టీసీపై ఆర్థిక భారం పడిందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేయడమనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదన్నారు. ప్రైవేటు ఆపరేటర్స్ ద్వారా బస్సులను నడిపిస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. డీజిల్ ధరలు పెరిగినప్పటికీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడమని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న బస్సుల స్థానంలో ప్రైవేటు ఎలక్ర్టికల్ బస్సులు పెడితే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదని తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సులకు కిలో మీటర్‌కు రూ. 7, డీజిల్ బస్సులకు రూ. 19 ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. అటు వాతావరణ కాలుష్యం కూడా అవదని తెలిపారు. ఖర్చు తగ్గడం వల్ల ప్రయాణికులకు అదనపు సేవలు సైతం అందించగలుగుతామని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వెల్లడించారు.

Next Story