RTC బస్సుకు తప్పిన పెను ప్రమాదం

by Muthe.Rajitha |

ఏపీలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

RTC బస్సుకు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు కొద్దిలో ప్రాణాలతో బయట పడ్డారు. పుట్లూరు నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలోకి దూసుకు వెళ్ళింది. అయితే స్టీరింగ్ స్టక్ కావడం వల్లే బస్సును రోడ్డు పక్కకు సడన్ గా తిప్పాల్సి వచ్చిందని డ్రైవర్ చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే సాయంత్రం కావడంతో బస్సులో జడ్పీ స్కూల్, ఆదర్శ పాఠశాల స్టూడెంట్స్, మహిళలు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి అందరినీ క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదంపై విచారణ చేపట్టారు.

Next Story