- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. 45 మందిని కాపాడిన కానిస్టేబుల్
by Muthe.Rajitha |
ఏపీలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తుండగా.. సంగం వద్ద రన్నింగ్‌లో ఉన్న బస్సు కింద భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు వెనకాల బైక్ మీద వెళ్తున్న కానిస్టేబుల్ నాగార్జున గమనించి, ముందుకు వెళ్లి బస్సును ఆపి, డ్రైవర్ కు విషయం తెలపగా.. వెంటనే బస్సు నిలిపి వేసాడు. మొత్తం 45 మంది ప్రయాణికులను క్షేమంగా కిందకు దించారు. అనంతరం బస్సు ఇంజన్ ఆపేయడంతో మంటలు ఆగిపోయాయి. పెను ప్రమాదం నుంచి కాపాడినందుకు కానిస్టేబుల్ నాగార్జునకు అభినందనలు తెలిపారు ప్రయాణికులు, డ్రైవర్.
Next Story






