- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Train Robbery: రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ .. అర్ధరాత్రి దొంగల హల్చల్
by Thanuru Gopichand |
అనంతపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్ప్రెస్ లో దొంగలు చొరబడి దోపిడీకి పాల్పడ్డారు.

X
దిశ డైనమిక్ బ్యూరో : అనంతపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్ప్రెస్ లో (Express) దొంగలు చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. నిజామాబాద్ నుంచి తిరుపతికి (Tirupathi) వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్.. రాత్రి 1.15 గంటల సమయంలో గుత్తి రైల్వే స్టేషన్ శివార్లలో క్రాసింగ్ కోసం నిలిపివేశారు. ఆ సమయంలో కొంతమంది దొంగలు బోగీలోకి ప్రవేశించి.. నిద్రపోతున్న వారి మెడలో గొలుసులు లాక్కుంటూ వెళ్లారు. దాదాపు పది బోగీల్లో ఈ దోపిడీ జరిగినట్లు సమాచారం. ఐదుగురు దుండగులు బోగీల్లో ఎక్కినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. రైలు గుత్తి స్టేషన్ నుంచి వెంటనే కదిలి వెళ్లడంతో బాధితులు అక్కడ ఫిర్యాదు చేయటానికి అవకాశం లేకుండా పోయింది. గమ్యస్థానం తిరుపతికి చేరాక ఎనిమిది మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






