రోడ్లకు మహర్దశ.. రూ.205.12 కోట్లు విడుదల

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్లు గుంతలపడి పాడై పోయాయి...

రోడ్లకు మహర్దశ.. రూ.205.12 కోట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్లు గుంతలపడి పాడై పోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజల కోసం పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలో దెబ్బతిన్న పలు రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పలు జిల్లాల్లోని ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి రూ.205.12 కోట్ల నిధుల విడుదలకు పరిపాలనా పరమైన అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాహనాల రద్దీ, ప్రాధాన్యత మేరకు ఎంపిక చేసిన 126 రోడ్ల పనులు అధికారులు చేపట్టనున్నారు. తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ, రాష్ట్ర హైవేల ఇంజినీర్ అండ్ చీఫ్‌కు రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story