- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RK Roja: ఆంజనేయులును అక్రమంగా అరెస్ట్ చేశారు.. మాజీ మంత్రి రోజా ఫైర్
ముంబై నటి కాదంబరీ జెత్వానీ (Kadambari Jethwani) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ముంబై నటి కాదంబరీ జెత్వానీ (Kadambari Jethwani) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు (Former AP Intelligence Chief PSR Anjaneyulu) ఇవాళ అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు ఏపీ సీఐడీ (AP CID) అధికారులు ఆయనను హైదరాబాద్ (Hyderabad)లో బేగంపేట నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆంజనేయులు (Anjaneyulu) అరెస్ట్‌పై మాజీ మంత్రి రోజా (Former Minister RK Roja) తీవ్ర స్థాయిలో స్పందించారు. కేసు విషయంలో కొందరు పోలీసులు కావాలనే తప్పుదోవ పట్టిస్తూ.. తప్పు మీద తప్పులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ (Skill Development Scam) కేసులో తొక్కి పెట్టారని.. దమ్ముంటే స్కిల్ కేసుపై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సీబీఐ (CBI) విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. అమరావతి (Aamaravati)లో అభివృద్ధి పనుల కోసం రూ.36 వేల కోట్లకు టెండర్లు వేశారని.. ఇప్పుడు ఆ బడ్జెట్‌ను రూ.76 వేల కోట్లకు ఎలా పెంచారో చెప్పాలని ధ్వజమెత్తారు. ఇక రాజధాని అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా అని రోజా ప్రశ్నించారు.






