Anitha: ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన

by Thanuru Gopichand |

విశాఖపట్నం బీచ్ ఒడ్డున జూన్ 21న యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు.

Anitha: ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖపట్నం (Visakha) బీచ్ ఒడ్డున జూన్ 21న యోగా దినోత్సవానికి (Yoga Day) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Modi) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై హోం మంత్రి వంగలపూడి అనిత (Home minister Anitha) ఈరోజు సమీక్షించారు. జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ , పోలీస్ కమిషనర్ శంఖభ్రతబాగ్జి , జేసీ మయూర్ అశోక్ తో కలిసి బీచ్ రోడ్ లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. యోగా డేకు భారీగా ప్రజలు రానున్న నేపథ్యంలో భద్ర తా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రధాని పర్యటనలో అధికారులు సమన్వయంగా సమర్థవంతంగా పని చేయాలని ఆదేశించారు

Next Story