సంక్రాంతి రిజర్వేషన్లు ఫుల్.. రేపట్నుంచి తెరచుకోనున్న వీకెండ్ విండో బుకింగ్

by Naga Rani Yarlagadda |

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. దేశంలో తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా సొంతూరికి చేరుకోవాల్సిందే.

సంక్రాంతి రిజర్వేషన్లు ఫుల్.. రేపట్నుంచి తెరచుకోనున్న వీకెండ్ విండో బుకింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. దేశంలో తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా సొంతూరికి చేరుకోవాల్సిందే. కానీ.. ఉన్న చోటు నుంచి సొంతూరికి ప్రయాణమే చాలా కష్టం బస్సులు, రైళ్లు, ఆఖరికి విమానాలు కూడా ఫుల్ అయిపోతాయి. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర కార్లు, టూవీలర్లు దర్శనమిస్తాయి. 15-20, ఆపైన ఉండే స్లీపర్ కోచ్ లు ఉండే రైళ్లలో కాలు పెట్టేందుకు కూడా ఖాళీ కనిపించదు. దీనిని బట్టి రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించండి. పేరుకు రిజర్వేషన్ బోగీలే కానీ.. జనరల్ కంపార్ట్మెంట్లనే తలపిస్తాయి.

2026 జనవరిలో సంక్రాంతి వీకెండ్ తర్వాత వస్తోంది. జనవరి 12, 16 సెలవులు పెడితే.. ఈసారి సంక్రాంతికి సొంతూరిలో 9 రోజులు ఉండే ఛాన్స్ ఉంది. దీంతో సంక్రాంతి రిజర్వేషన్ల కోసం ప్రయాణికులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జనవరి 9 శుక్రవారం కాగా.. ఇప్పటికే చాలా వరకూ టికెట్లు బుక్కైపోయి.. రిగ్రెట్ చూపిస్తోంది. వందేభారత్ రైలుకైనా వెళ్దామంటే.. ప్యాసింజర్లకు వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య నడిచే గోదావరి ట్రైన్ రిజర్వేషన్, వెయిటింగ్ కూడా పూర్తయి రిగ్రెట్ పడింది. గరీబ్ రథ్, ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, మహబూబ్ నగర్ - విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, విశాఖ ఎక్స్ ప్రెస్ లు కూడా రిగ్రెట్ చూపిస్తున్నాయి. స్లీపర్, ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ అనే తేడా లేదు. టికెట్ బుక్కైతే చాలన్న చందంగా.. సంక్రాంతి ముందు వీకెండ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

ఇక జనవరి 10 శనివారం రిజర్వేషన్లు రేపు (మంగళవారం) ఉదయం 8 గంటలకు ఓపెన్ కానున్నాయి. IRCTC అకౌంట్ ఉండి, ఆధార్ లింక్ చేసుకున్నవారు 8 గంటల నుంచి, లింక్ చేసుకోని వారు 8.15 గంటల నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.. ఇప్పటికైనా మీ ఆధార్ లింక్ అవ్వకపోతే వెంటనే యాప్ లో లింక్ చేసుకోండి. జనవరి 10వ తేదీకి నవంబర్ 11, 11వ తేదీకి నవంబర్ 12, 12వ తేదీకి నవంబర్ 13న రిజర్వేషన్ విండో తెరచుకోనుంది.

జనవరి 13,14,15 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వస్తున్నాయి. గతంలో రైల్వే రిజర్వేషన్ నాలుగు నెలల ముందు ఉండేది. కానీ.. ఏజెంట్లు బల్క్ గా టికెట్లు బుక్ చేస్తుండటంతో చాలా మందికి టికెట్లు దొరకడం లేదని ఆ రూల్ ను మార్చి 60 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ ను అమల్లోకి తెచ్చింది రైల్వేశాఖ.

Next Story