- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు.. హక్కులు వేరు : మంత్రి
తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదం.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయమై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల రాజకీయ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదం రేకెత్తుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బిఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోలవరం, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మాటల యుద్ధం మొదలైంది. దాంతో పాటు నీటి హక్కులను కాపాడాలని కోరుతూ తెలంగాణ సుప్రీంకోర్టు మెట్లను ఎక్కింది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన అధికార పక్ష నాయకులు సీరియస్ గా స్పందిస్తున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలని.. పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ఎటువంటి అభ్యంతరాలను లేవనెత్తలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో గోదావరి జలాలను వాడుకునేందుకు ఏపీకి ఉన్న హక్కులను వాడుకోనివ్వాలని హితవు పలికారు.
ఆయన దారిలోనే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా నదీ జలాల పంపకాల విషయమై స్పందించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు.. హక్కులు వేరని స్పష్టం చేశారు. హక్కుల విషయంలో తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2020లోనే ఆగిందన్నారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు. అనుమతులు లేకుండా పనులు చేపట్టడం వల్లనే పనులు నిలిచిపోయాయనే విషయాన్ని గుర్తు చేశారు.






