ఏపీలో ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్

by velandi.Saikiran |

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు విపత్తుల నిర్వహణ సంస్థ

ఏపీలో ఈ  జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు. ముఖ్యంగా ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది విపత్తుల నిర్వహణ సంస్థ. దింతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.

గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. భారీ వర్షాల తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Next Story