Ration: పాత విధానంలోనే రేషన్!

by Thanuru Gopichand |

‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వ్యాన్ లు నిలుపుదల చేస్తోంది.. ఇకనుంచి రేషన్ షాపులలో డీలర్ల ద్వారా బియ్యం తీసుకోవాలి..’

Ration: పాత విధానంలోనే రేషన్!
X

ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికి రేషన్​.. ఇక బంద్?

రేపటి క్యాబినెట్​సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం..!

దిశ, డైనమిక్ బ్యూరో : ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వ్యాన్ లు నిలుపుదల చేస్తోంది.. ఇకనుంచి రేషన్ షాపులలో డీలర్ల ద్వారా బియ్యం తీసుకోవాలి..’ అనే వార్త సోషల్​మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. కానీ.. రేపు జరిగే క్యాబినెట్​సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు భావిస్తున్నారు. ఎండీయూ (Mobile ration delivery) వాహనాల ద్వారా ఇంటికి రేషన్​అందించే విషయంపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోవచ్చని కొద్దిరోజులుగా అంతా భావిస్తున్నారు. రెండు రోజుల కిందట మంత్రి నాదెండ్ల మనోహర్​(Nadendla Manohar) దీనిపై స్పందించారు. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఆ నిర్ణయం ఏమిటి..? వాహనాలను కొనసాగిస్తారా..? లేక రేషన్​షాపుల్లో సరుకులు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో పలు మార్పులను తీసుకువచ్చింది. అయితే ఎండీయూ వాహనాల ద్వారా రేషన్​సరఫరాను మాత్రం యథాస్తితిగా కొనసాగించింది. కొద్దిరోజుల కిందట రేషన్​డీలర్లు, ఎండీయూ వాహనాల ఆపరేటర్లతో మంత్రి చర్చలు జరిపి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాహనాల ద్వారా రేషన్​పంపిణీ సక్రమంగా జరగడం లేదని, అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయని, కాబట్టి రేషన్​సరఫరా తిరిగి తమకే అప్పగించాలని డీలర్లు కోరారు. వాహనాలు ఆపితే తాము నష్టపోతామని ఆపరేటర్లు తెలిపారు. అయితే ఎండీయూ వాహనాల వల్ల ప్రజలకు మేలు జరగకపోగా, ప్రభుత్వానికి అదనపు భారం అవుతోందనేది కూటమి పెద్దల అభిప్రాయం. ఈ క్రమంలో వాహనాల వ్యవస్థను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Next Story