Ration: రేషన్ పంపిణీ.. రికార్డ్! ఒక్క రోజులో ఇన్ని లక్షలమందికా..?

by Thanuru Gopichand |   (  Updated:2025-06-03 11:34:50  IST  )

ఏపీలో ఈ నెల రేషన్​నిత్యావసరాల పంపిణీ రికార్డు స్థాయిలో నమోదైందని మంత్రి నాదెండ్ల మనోహర్​(Nadendla Manohar) వెల్లడించారు.

Ration: రేషన్ పంపిణీ.. రికార్డ్! ఒక్క రోజులో ఇన్ని లక్షలమందికా..?
X

ఒక్క రోజులో 19,21,717 మందికి పంపిణీ

రేషన్ లెక్కలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల

దిశ, డైనమిక్​ బ్యూరో : ఏపీలో ఈ నెల రేషన్​నిత్యావసరాల పంపిణీ రికార్డు స్థాయిలో నమోదైందని మంత్రి నాదెండ్ల మనోహర్​(Nadendla Manohar) వెల్లడించారు. ఈ మేరకు ఈ ఉదయం ఒక ట్వీట్​చేశారు. నెల మొదటి రోజు రేషన్​పంపిణీకి సంబంధించి గత మూడు నెలల లెక్కలను వివరించారు. ఈ నెల జూన్​ఒకటో తేదీన రికార్డు స్థాయిలో 19,21,717 మందికి పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,24,900 మందికి, అత్యల్పంగా అల్లూరి సీతా రామరాజు జిల్లాలో 3,684 మందికి రేషన్​పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. గత మే నెల ఒకటో తేదీన ఇదే కర్నూలు జిల్లాలో ఒకటో తేదీన 61, 600 మందికి పంపిణీ చేసినట్లు తెలిపారు. ఏప్రిల్​ ఒకటో తేదీన 47,4147 మందికి పంపిణీ చేసినట్లు వివరించారు. గత రెండు నెలల్లో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్​ సరఫరా జరగగా.. ఈ నెల రేషన్​దుకాణాల్లో పాత పద్ధతిలో రేషన్​ పంపిణీ చేశారు. దీనిని బట్టి రేషన్ ​దుకాణాల ద్వారానే అత్యధికంగా రేషన్​ పంపిణీ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఏపీలో ఉన్న మొత్తం 29,761 రేషన్​ దుకాణాల ద్వారా ఈ పంపిణీ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story