- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లాన్ ప్రకారమే ట్రాఫిక్ క్లియర్.. కానిస్టేబుల్ జయశాంతిపై విమర్శలు
రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: తన పరిధి కానప్పటికీ చంటి బిడ్డను ఎత్తుకొని రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి(Rangampet woman constable Jayashanti) సామర్లకోట(Samarlakota)లో రాత్రి వేళ అంబులెన్స్ కోసం ట్రాఫిక్ క్లియర్ చేసిన విషయం తెలిసిందే. అయితే తనపై గతంలో ఉన్న విమర్శలు పొగొట్టుకునేందుకు ఆమె ట్రాఫిక్ క్లియర్ చేసి హడావిడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుడు సర్టిఫికెట్‌తో గత సంవత్సరం నిర్వహించిన డీఎస్సీలో జయశాంతి టీచర్ ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్‌గా పని చేస్తున్న భర్త తాతారావు సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందారని, విచారణ చేసి విద్యాశాఖ అధికారులు జయశాంతి టీచర్ ఉద్యోగం రద్దు చేశారు. అంతేకాదు గతంలో నకిలీ ఎస్సైగా చలామణి అయిన హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావుకు జయశాంతి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్‌కి జయశాంతి భర్తని బదిలీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్‌కు జయశాంతి వచ్చారు. ఈ విమర్శలు పోగొట్టుకునేందుకు ఆమె ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జయశాంతిపై విమర్శలు సైతం వినిపిస్తున్నాయి






